టూరిస్టులకు రష్యా కొత్త వీసా విధానం
- February 26, 2023
మాస్కో: టూరిస్టుల కోసం రష్యా కొత్త వీసా విధానం ప్రవేశపెట్టింది. భారత్ సహా 19 దేశాలకు చెందిన పర్యాటకులకు ఆఫర్ ప్రకటించింది.
అదేమిటంటే తమ దేశంలోని హోటళ్లలో రూమ్ బుక్ చేసుకుంటే వీసా జారీలో ఉదారత చూపనున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన రష్యా హోటళ్లలో రూమ్ బుక్ చేసుకున్నవారికి టూరిస్టు వీసా దాదాపు వచ్చేసినట్లే అని నిపుణులు అంటున్నారు. పర్యాటకరంగానికి ఊతం ఇచ్చేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్‌తో పాటు బహ్రెయిన్, బ్రూనై, కంబోడియా,చైనా, ఇండోనేషియా, ఇరాన్, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, కువైట్, లావోస్, మలేసియా, మెక్సికో, మయన్మార్, ఒమన్, సౌదీ అరేబియా, సెర్బియా, థాయ్‌లాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్ దేశాలకు ఈ కొత్త వీసా విధానం వర్తించనున్నది. ఆయా దేశాల పర్యాటకులు రష్యాలోని హోటల్స్‌లో రిజర్వేషన్ చేసుకుంటే ఆరు నెలల వరకు టూరిస్టు వీసాను సునాయాసంగా పొందొచ్చు. రష్యా 11 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. దాంతోపాటు వీసా జారీ ప్రక్రియను సరళతరం చేసింది. వారం రోజుల్లోనే కొత్త వీసా విధానాన్ని అమలులోకి తెచ్చింది. మరో 70 దేశాలకు ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టాలని పుతిన్ సర్కార్ యోచిస్తోంది. త్వరలో ఈ వీసాలు కూడా అమలులోకి వస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







