మార్చి 26 నుంచి విజయవాడ-షిర్డీ విమాన సర్వీసులు ప్రారంభం…
- February 26, 2023
విజయవాడ: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం…ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ముందుకు రావడంతో పాటు ప్రయాణ షెడ్యూల్ను కూడా ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ATR 72-600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరి 3 గం.కు షిర్డీ చేరుకుంటుంది
షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గం.కు బయలుదేరి సాయంత్రం 4.35 గం.కు గన్నవరం చేరుతుంది. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ 4,246, షిర్డీ నుంచి గన్నవరంకు రూ.4,639 గాను నిర్ణయించారు.ఇప్పటి వరకు షిర్డీ వెళ్లేందుకు రైలు,రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ సర్వీస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2.50 గంటల ప్రయాణం….
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







