సౌదీ వాతావరణంలో భారీ మార్పులు.. సివిల్ డిఫెన్స్ హెచ్చరిక
- February 27, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో ఆదివారం నుండి వచ్చే బుధవారం వరకు వాతావరణంలో భారీ హెచ్చుతగ్గులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సివిల్ డిఫెన్స్ పిలుపునిచ్చింది. రియాద్ ప్రాంతంలో రాజధాని, ధర్మా, అల్-అఫ్లాజ్, అల్-ముజాహ్మియా, అల్-ఖర్జ్, హౌతాత్ బని తమీమ్, వాడి అద్-దవాసిర్ మరియు అల్-ఖువైయాతో సహా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా మక్కాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని సివిల్ డిఫెన్స్ తెలిపింది.
తైఫ్తో సహా మక్కాలోని కొన్ని ప్రాంతాలు, అభా మరియు ఖామిస్ ముషైత్తో సహా అసిర్ ప్రాంతం, జజాన్, అల్-బహా మరియు నజ్రాన్ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, ఇది వరదలకు దారితీయవచ్చని హెచ్చరించింది. అంతేకాకుండా జెద్దా, అల్ లిత్, ఖులైస్ మరియు అల్-కున్ఫుదాతో సహా మక్కా ప్రాంతంలో తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. వర్షపు నీరు నిలువ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, అందులో ఈత కొట్టడం ప్రమాదకరమని సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది. ప్రజలు అధికార యంత్రాంగం సూచనలకు కట్టుబడి ఉండాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







