రైతులకు శుభవార్త...
- February 27, 2023
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ రోజు వారి ఖతాల్లో నగదును జమచేస్తామని తెలిపింది. రైతులకు ప్రతీయేటా పంటలసాగు నిమిత్తం ‘ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం ద్వారా కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం విధితమే. అర్హులైన ప్రతీఒక్క రైతుకు ఏడాదికి రూ. 6వేల చొప్పున అందిస్తుంది. వీటిని మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్రం జమచేస్తుంది. ఇప్పటి వరకు 12 విడతలు అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధికార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. బెళగావిలో లక్షమందికిపైగా కిసాన్ సమ్మాన్ నిధి, జలమ్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో నిర్వహించనున్న సభలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా 13వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను మోదీ విడుదల చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కేంద్రం పంపిణీ చేసిన విషయం విధితమే.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అకౌంట్లో జమకాకుంటే.. అవి వచ్చాయా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ వివరాలు తెలుసుకోవచ్చు. వెబ్ సైట్‌లో బెనిఫీషియరీ లిస్ట్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయడం ద్వారా రాష్ట్రం, జిల్లా, మండల వారీగా వివరాలు నమోదు చేసి అర్హులైన రైతుల వివరాలను తెలుసుకోవచ్చు. డబ్బులు రైతు ఖాతాలో జమకాకుంటే ఎందుకు జమ కాలేదో కూడా అక్కడ కారణం ఉంటుంది. దీన్ని సరిచేసుకుంటే తర్వాత సీఎం కిసాన్ డబ్బులు పొందొచ్చు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







