ఒమన్ లో మొదలైన ‘44కప్’ 2023 సీజన్ సందడి
- February 27, 2023
మస్కట్: ‘44కప్’2023 సీజన్ కోసం ఒమన్ లోని అల్ మౌజ్ మస్కట్ మెరీనా సిద్ధమవుతుంది. మార్చి 1-5 వరకు ప్రారంభం కానుంది. ఒమన్ లో 44కప్ ప్రారంభంతో వచ్చే ఏడు నెలల్లో జరిగే ఐదు ఈవెంట్ల సీజన్ ప్రారంభమవుతుంది. ఒమన్ సెయిల్ 44కప్ గత సీజన్ ఫైనల్‌లో ప్రవేశించింది. ఈ సంవత్సరం 44కప్ మొదటి లెగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది.
ఒమన్ అత్యంత నిష్ణాతులైన నావికులలో ఒకరైన ముసాబ్ అల్ హదీ, హుస్సేన్ అల్ జాబ్రీ వ్యూహకర్తగా.. నాసర్ అల్ మషారీ ప్రధాన ట్రిమ్మర్‌గా వ్యవహరించనున్నారు. వలీద్ అల్ కిండీ, హైతామ్ అల్ వహైబీ, అక్రమ్ అల్ వహాబీ, రాద్ అల్ హదీ, యాసిర్ అల్ రహ్బీ, అబ్దుల్‌రహ్మాన్ అల్ మషారీ, అలీ అల్ బలూషి అహ్మద్ అల్ హసానీ, మొదటి మహిళా ఒమానీ నావికురాలు ఇబ్తిసామ్ అల్ సల్మీ 44కప్ లో ఒమన్ సెయిల్ జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఐరోపా నుంచి ఆరు దేశాలు, ప్రిన్సిపాలిటీలకు చెందిన ఎనిమిది జట్లతో పాటు మొనాకోకు ప్రాతినిధ్యం వహిస్తున్న గత సీజన్ విజేతలు చరిష్మా, స్లోవేనియాకు చెందిన హ్రస్త్నిక్ 1860 ద్వారా రన్నరప్‌గా నిలిచిన సీరీఫ్, మొనాకో నుండి మూడవ స్థానంలో నిలిచిన టీమ్ నికా కూడా రేసులో పాల్గొంటాయి. ఫ్రాన్స్‌కు చెందిన అలెఫ్ రేసింగ్, స్వీడన్‌కు చెందిన ఆర్టెమిస్ రేసింగ్, స్విట్జర్లాండ్‌కు చెందిన బ్లాక్ స్టార్ రేసింగ్ టీమ్, గ్రేట్ బ్రిటన్‌కు చెందిన పెనిన్సులా రేసింగ్, టీమ్ ఆక్వా 44 కప్ లో సందడి చేయనున్నాయి.
44కప్ సీజన్‌లో రెండవ ఈవెంట్ స్వీడన్‌లోని మార్స్ట్రాండ్‌లో 28 జూన్ నుండి 2 జూలై 2023 వరకు, మూడో ఈవెంట్ కోవ్స్ (యూకే)లో ఆగస్టు 9 నుండి 13 వరకు, సీజన్ నాల్గవ ఈవెంట్ స్పెయిన్‌లోని అల్కైడెసా మెరీనాలో, జిబ్రాల్టర్‌తో సరిహద్దు పక్కనే జరుగనుంది.ఇక సీజన్ ముగింపు కానరీ దీవులలోని కాలెరో మెరీనాస్‌లో నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







