గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత
- February 27, 2023
కువైట్: కువైట్ జాతీయ సెలవుదినాలను జరుపుకునే సందర్భంగా ఫిబ్రవరి 28న (మంగళవారం) సాయంత్రం 5.30 గంటల నుండి ఈవెంట్ ముగిసే వరకు బాణాసంచా ప్రదర్శన కోసం గల్ఫ్ స్ట్రీట్ పాక్షికంగా మూసివేయనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. బాణాసంచా ప్రదర్శన రాత్రి 8:00 గంటలకు కువైట్ టవర్స్‌లో జరగనుంది. వివిధ పబ్లిక్ స్క్వేర్‌ల నుండి ఉచిత బస్సులు అందుబాటులో ఉన్నాయని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
అలాగే హవలీ పార్క్, షార్క్ మార్కెట్, షార్క్ పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు పేర్కొంది. హవలీ గవర్నరేట్ ఇన్‌స్టిట్యూట్‌ల పార్కింగ్ స్థలాలు, గల్ఫ్ స్ట్రీట్‌లోని యాచ్ క్లబ్, రెస్టారెంట్‌ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.లాయర్స్ అసోసియేషన్ వద్ద ప్రత్యేక అవసరాల కోసం పార్కింగ్ కేటాయించారు. భద్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. భద్రత, ట్రాఫిక్, ఏదైనా మానవతా సహాయం కోసం 112 అత్యవసర కాల్‌లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







