మార్చి 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో 2023
- February 27, 2023
బహ్రెయిన్: అరేబియా గల్ఫ్‌లోని ప్రముఖ గార్డెనింగ్, వ్యవసాయ ప్రదర్శన అయిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ గార్డెన్ షో (BIGS) 2023 ఎడిషన్ మార్చి 9న జరుగనుంది. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈవెంట్ ను హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీం అల్ ప్రారంభించనున్నారు. సఖిర్‌లోని ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లోని అంతర్జాతీయ ప్రదర్శన మార్చి 9న మధ్యాహ్నం 1 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, మార్చి 10 నుండి 12వ తేదీ వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని NIAD సెక్రటరీ-జనరల్ షైఖా మరమ్ బింట్ ఇసా అల్ ఖలీఫా తెలిపారు. ఈ సంవత్సరం BIGS 'వాటర్: రీజనరేటింగ్ లైఫ్" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అధ్యయనాలు నిర్వహించిన పలు ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. 176 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు తమ డిజైన్లు, ఉత్పత్తులు, సాంకేతికతలు, ఆవిష్కరణలతో BIGS 2023లో పాల్గొంటారని భావిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.bigs.com.bh, [email protected] లేదా 32111603, 17171603లో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







