OTT లో సందడి చేస్తున్న వీరయ్య
- February 27, 2023
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య ఓటిటిలోకి వచ్చేసింది. బాబీ – చిరంజీవి కలయికలో శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ కీలక పాత్రలో నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. టాక్ పరంగానే కాదు వసూళ్ల పరంగా కూడా మెగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించడం స్టార్ట్ చేసింది.
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. ఓ వైపు ధియేటర్‌లో కనకవర్షం కురిపిస్తూనే..ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి అంటే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవికి ఇదే మేజర్ హిట్ అని చెప్పవచ్చు. ఆచార్య డిజాస్టర్‌గా నిలిస్తే..గాడ్ ఫాదర్ యావరేజ్‌గా ఆకట్టుకుంది. వాల్తేరు వీరయ్య మాత్రం పూనకాలు తెప్పిస్తోంది.
ఇక ఈ మూవీ హిట్ తో చిరు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో వేదాళం రీమేక్ భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా శరవేగంగా జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







