సివరాఖరికి శివగామికే ఫిక్సయిపోయిన త్రివిక్రముడు.!
- February 27, 2023
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జెట్ స్పీడులో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి మహేష్ బాబు ఇంట వరుస విషాదాలతో బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది. అలాగే, త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగానే ఓ సీనియర్ లేడీ పాత్రకు అత్యధిక ప్రాధాన్యత వుంటుంది. అలా ఈ సినిమాలోనూ ఓ సీనియర్ లేడీ పవర్ ఫుల్ వుండనే వుంది.
ఆ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ నటీమణుల పేర్లు వినిపించగా.. చివరికి టాలీవుడ్ డేరింగ్ లేడీ రమ్యకృష్ణ వద్దే త్రివిక్రమ్ బండి ఆగిపోయింది. ఎంతైనా శివగామికి మించిన వాళ్లుంటారా చెప్పండి.! త్వరలో జరగబోయే షెడ్యూల్లో రమ్యకృష్ణ పాల్గొనబోతోందనీ సమాచారం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







