బాలయ్య కన్నా ముందే చందమామ ఫినిష్ చేసేస్తుందట.!
- February 27, 2023
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో మూవీలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ, దాదాపు కాజల్ ఈ ప్రాజెక్ట్‌కి సెట్ అయిపోయినట్లే అని తెలుస్తోంది.
కాగా, మార్చి 4 నుంచి కాజల్ సెట్స్‌లో అడుగు పెట్టబోతోందనీ తాజా ఖబర్. బాలయ్య కన్నా ముందే కాజల్‌తో షూట్ చేయాల్సిన కొంత పార్ట్ కంప్లీట్ చేసేస్తారట. ఆ తర్వాతే బాలయ్య సెట్స్‌లో అడుగు పెడతారట. తొలిసారి బాలయ్యతో కాజల్ నటిస్తున్న చిత్రమిది.
గతంలోనూ బాలయ్య సరసన ఛాన్స్ వచ్చినా కాజల్ సింపుల్‌గా నో చెప్పేసింది. కానీ, ఇప్పుడు మారిన ఈక్వేషన్స్ దర్మిలా వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకూడదనుకుంది కాబోలు.. వెంటనే ఓకే చెప్పేసిందట. అవును నిజమే, కాజల్‌కి ఇది గోల్డెన్ ఛాన్సే మరి. వదులుకుంటే అస్సలు బాగోదు.! మరోవైపు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమాలోనూ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







