పవన్-సాయి తేజ్ కాంబో మూవీ: అదిరిపోయే ఓ ఐటెం సాంగ్.?

- February 27, 2023 , by Maagulf
పవన్-సాయి తేజ్ కాంబో మూవీ: అదిరిపోయే ఓ ఐటెం సాంగ్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం ‘వినోదయసితం’. తమిళ రీమేక్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. సినిమా ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో.. అలా లీకులు గోల మొదలైంది. షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో స్వైర విహారం చేస్తున్నాయ్.
ఆ సంగతి అటుంచితే.. అసలు మ్యాటర్‌లోకి వచ్చేద్దాం. ఈ సినిమా ఒరిజినల్‌ వెర్షన్‌లో పాటలుండవ్. కానీ, తెలుగు నేటివిటీకి వచ్చేసరికి.. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమా అంటే పాటలుండి తీరాల్సిందే. అయితే, ఈ సినిమాలో పవన్‌కి జోడీ ఎవరూ వుండరు. దేవుడి పాత్రలో పవన్ కనిపిస్తాడు.
కానీ, మాస్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయాలంటే ఓ స్పెషల్ సాంగ్ తప్పనిసరి అని ఫ్యాన్స్ నుండి డిమాండ్స్ వినిపిస్తున్నాయట. దాంతో, ఓ మాస్ ఐటెం సాంగ్‌ని ఈ సినిమాలో చొప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ సాంగ్‌లో నర్తించేందుకు ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మను ఎంగేజ్ చేశారనీ తెలుస్తోంది.
అలాగే, ఓ ఫేమస్ బాలీవుడ్ సాంగ్ ఈ సినిమా కోసం రీమిక్స్ చేయబోతున్నారనీ సమాచారం. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com