ఖతార్‌లో ‘కరీమ్’ సేవలు నిలిపివేత
- February 28, 2023
ఖతార్: ఉబెర్ మిడిల్ ఈస్టర్న్ బిజినెస్ కంపెనీ అయిన ‘కరీమ్’ మంగళవారం నుండి ఖతార్‌లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తమ వినియోగదారులకు సందేశాలను పంపింది. ఇటీవల ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ లో ఉబెర్, స్థానిక టాక్సీ ప్రొవైడర్ కర్వా కార్లతో పాటు సందర్శకులను, ఫుట్ బాల్ అభిమానులను రవాణా చేయడానికి టోర్నమెంట్ అధికారిక ప్రణాళికలలో కరీమ్(Careem) వాహనాలు కూడా ఉన్నాయి. "దురదృష్టవశాత్తూ కరీమ్ రైడ్ హెయిలింగ్ కార్యకలాపాలు ఫిబ్రవరి 28 నుండి ఖతార్‌లో పనిచేయవు" అని కస్టమర్లకు పంపిన మెసేజ్ లో కంపెనీ పేర్కొంది. అయితే, కరీమ్ క్రెడిట్‌ను కలిగి ఉన్న కస్టమర్‌లకు మార్చి 15 నాటికి పూర్తి రీఫండ్‌ను అందజేస్తామని తన మెసేజ్ లో తెలియజేసింది. కాగా, కరీమ్ తన కార్యాకలాపాలను ఎందుకు నిలిపివేస్తుందో అన్న విషయంపై మాత్రం కంపెనీ వివరణ ఇవ్వలేదు. ఊబర్ టెక్నాలజీస్ 2019లో $3.1 బిలియన్లకు కరీమ్‌ను కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









