చెన్నై వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ నాజర్‌కు..
- May 04, 2016
మూడు దశాబ్దాలు.. 400 సినిమాలు.. ఇది గుణచిత్రనటుడు నాజర్ నటప్రస్థానం. కె.బాలచందర్ రూపొందించిన 'కల్యాణ అగాదిగల్' ద్వారా వెండితెరకు పరిచయమైన నాజర్ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంగ్ల భాషలోనూ సినిమాలు చేశారు. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నాజర్‌కి తాజాగా చెన్నై వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 7న నాజర్ ఈ గౌరవాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ 'ఇదంతా నాకు సర్ప్రైజ్లా ఉంది. చాలా సంతోషంగానూ, ఉద్వేగభరితంగానూ అనిపిస్తోంది.ఇది నేను ఊహించని గౌరవం. దీనికి నేనెంతవరకు అర్హుడినో తెలియదు. ఇప్పటివరకు నాకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తూనే వచ్చాను. బహుశా అదే ఈ గౌరవానికి కారణంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా బాధ్యతలు మరింత పెరిగాయి. ఇకమీదట మరింత జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటాను. మా అమ్మనాన్నలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను' అని తెలిపారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







