ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని : జయంత్ సిన్హా
- May 04, 2016
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. ఇప్పట్లో అలాంటి అవకాశం ఏమీ లేదని పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన ఏమీ లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ పార్లమెంటులో ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన సాయం అందిస్తామని, నీతి ఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా ఆ రాష్ట్రానికి నిధులు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం రూ. 12,806 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో రూ. 4,403 కోట్లు, 2015-16లో రూ. 2 వేల కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ద్రవ్యలోటు భర్తీ కింద రూ. 2,803 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ. 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 850 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే లేదని జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







