మనం సినిమాను బాలీవుడ్ లో రీమేక్..
- May 04, 2016
అక్కినేని ఫ్యామీలి మూడుతరాల హీరోలు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా భారీ హైప్ క్రియేట్ చేసిన మనం, కథా కథనాల విషయంలో కూడా కొత్తదనంతో ఆకట్టుకుంది. నాగార్జున కెరీర్ లోనే బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రీమేక్ పై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ మనం బాలీవుడ్ రీమేక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ, మనం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం విక్రమ్ డైరెక్షన్ లో రిలీజ్ కు రెడీ అవుతోన్న 24 సినిమా షూటింగ్ సమయంలో మనం రీమేక్ పై చర్చ జరిగిందని వెల్లడించాడు విక్రమ్. 'ముంబైలో 24 మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ లీలా బన్సాలీని కలిశాను. ఆయన మనం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు', అని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు విక్రమ్.విక్రమ్ కె కుమార్ స్వయంగా మనం సినిమాను కోలీవుడ్ రీమేక్ చేయడానికి ట్రై చేశాడు. సూర్య, కార్తీ సూర్య తండ్రి శివకుమార్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించాడు. అయితే సూర్యకు మనం కన్నా 24 కథ బాగా నచ్చటంతో ముందుగా 24 సెట్స్ మీదకు వచ్చింది. మరి త్వరలో కోలీవుడ్ లో కూడా మనం రీమేక్ అవుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







