ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండండి
- February 28, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో ఎండాకాలం మొదలవ్వబోతుంది.ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో ఎండ వేడిమి వల్ల ప్రజలకు తలెత్తే అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.మార్చి 1 నుంచి ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ ( NPCCHH)’ కింద ‘ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ (IHIP)’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా వాతావరణ మార్పులు, ఎండ వేడిమి వల్ల తలెత్తే అంశాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా నమోదయ్యే స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దీంతో ఈ ఏడాది అధికంగా ఎండలు మండే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు ఎండల ద్వారా తలెత్తే అనారోగ్యం విషయంలో, వైద్య సేవలు అందించేదుకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.సంబంధిత ఫార్మాట్ ప్రకారం..రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇందుకు అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు, రోగులు, అనారోగ్య సమస్యలు వంటి వివరాల్ని పొందు పర్చి కేంద్రానికి అందించాలని ఆదేశించారు.దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఎండ వేడిమి వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనేందుకు అనుగుణంగా వైద్య సిబ్బందికి అవగాహన కల్పించడం, వైద్య సదుపాయాలు మెరుగుపర్చుకోవడం వంటివి చేయాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







