యూఏఈలో వరుసగా రెండో నెల పెరిగిన పెట్రోల్ ధరలు
- March 01, 2023
యూఏఈ : వరుసగా రెండో నెల కూడా యూఏఈలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మార్చి నెలలో రిటైల్ పెట్రోల్ ధరలు లీటర్‌కు 1.3 శాతానికి పైగా పెరిగింది. ఇంధన ధరల కమిటీ సూపర్ 98(3.09 దిర్హామ్‌లు/లీ), స్పెషల్ 95(2.97 దిర్హామ్‌లు/లీ), ఇ-ప్లస్(2.90 దిర్హామ్‌లు/లీ) అనే మూడు వేరియంట్ల ధరలను నాలుగు ఫిల్స్ చొప్పున పెంచడంతో ఈ ఏడాది మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే, మార్చి నెలలో డీజిల్ ధరలు 24 ఫిల్స్ తగ్గి 3.14 దిర్హామ్‌లకు చేరుకుంది. అంతర్జాతీయ ధరలతో సమానంగా ధరలు పెంచేందుకు 10 శాతానికి పైగా ధరలు పెంచిన ఫిబ్రవరితో పోలిస్తే పెట్రో ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉండటం గమనార్హం.రష్యా-ఉక్రెయిన్ మిలిటరీ వివాదం కారణంగా యూఏఈలో మొదటిసారిగా మూడు వేరియంట్ల ధరలు లీటరుకు Dh4ని దాటినప్పుడు చమురు ధరలు గత ఏడాది జూలైలో గరిష్ట స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోతుందనే భయంతో గత ఏడాది నాలుగో త్రైమాసికంలో ధరలు వేగంగా పడిపోయాయి. మంగళవారం, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $83.07 వద్ద ట్రేడవుతుండగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ మంగళవారం మధ్యాహ్నం బ్యారెల్‌కి $76.34 వద్ద ట్రేడయ్యాయి.
2022-23లో యూఏఈ రిటైల్ ఇంధన ధరలు (లీటరుకు దిర్హామ్‌లు)
నెల సూపర్ 98, స్పెషల్ 95, ఇ-ప్లస్
జనవరి 2.65, 2.53, 2.46
ఫిబ్రవరి 2.94, 2.82, 2.75
మార్చి 3.23, 3.12, 3.05
ఏప్రిల్ 3.74, 3.62, 3.55
మే 3.66, 3.55, 3.48
జూన్ 4.15 4.03 3.96
జూలై 4.63, 4.52, 4.44
ఆగస్టు 4.03 3.92 3.84
సెప్టెంబర్ 3.41, 3.3, 3.22
అక్టోబర్ 3.03, 2.92, 2.85
నవంబర్ 3.32, 3.20, 3.13
డిసెంబర్ 3.30, 3.18, 3.11
జనవరి( 2023) 2.78, 2.67, 2.59
ఫిబ్రవరి 3.05, 2.93, 2.86
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







