కువైట్‌లో ‘గూగుల్ పే’ సేవలు ప్రారంభం
- March 01, 2023
కువైట్: కువైట్‌లోని అనేక బ్యాంకులు గూగుల్ పే (Google Pay) సేవను ప్రారంభించాయి. ఇది బ్యాంక్ కస్టమర్లు వారి అండ్రాయిడ్ (Android), వేర్ ఓఎస్(Wear OS) పరికరాలను ద్వారా సులభంగా, సురక్షితంగా ఉపయోగించి చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. గూగుల్ పేతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపు చేయడానికి కస్టమర్లు తమ అండ్రాయిడ్ పరికరాన్ని ఇన్-స్టోర్ పేమెంట్ టెర్మినల్ దగ్గర పట్టుకోని లావాదేవీలను పూర్తి చేయవచ్చు. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తమ కార్డ్ హోల్డర్లు తమ అల్-తిజారీ కార్డ్‌లను గూగుల్ వాలెట్లో సేవ్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైజ్‌ల ద్వారా కస్టమర్లు ఎక్కడైనా చెల్లింపులు చేయడానికి వీలు అవుతుందని బ్యాంక్ తెలిపింది. అలాగే నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK), బుర్గాన్ బ్యాంక్ ,అహ్లీ యునైటెడ్ బ్యాంక్ (AUB) కూడా కువైట్‌లోని తమ కస్టమర్ల కోసం ఇలాంటి ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించాయి. ప్రతి గూగుల్ పే కొనుగోలు సురక్షితంగా ఉంటుంది. ఇది ముఖ గుర్తింపు, పాస్వర్డ్ లేదా వేలిముద్ర గుర్తింపుతో పనిచేస్తుంది. కాంటాక్ట్‌లెస్ కార్డ్ చెల్లింపులను ఆమోదించే ప్రతి అవుట్‌లెట్‌లో గూగుల్ పే కూడా ఆమోదించబడుతుంది. స్మార్ట్ వాచ్‌లు, టాబ్లెట్ లేదా ఇతర పరికరాలతో సహా ఏదైనా అండ్రాయిడ్, వేర్ ఓఎస్ పరికరాలలో కూడా కస్టమర్లు గూగుల్ పేని ఉపయోగించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







