బహ్రెయిన్‌లో 13% పెరిగిన డిజిటల్ చెల్లింపులు

- March 01, 2023 , by Maagulf
బహ్రెయిన్‌లో 13% పెరిగిన డిజిటల్ చెల్లింపులు

బహ్రెయిన్ : బహ్రెయిన్‌లో గత నెలలో 12 మిలియన్లకు పైగా నగదు రహిత లావాదేవీలు నమోదయ్యాయి. ఇది జనవరి 2022 కంటే 13% ఎక్కువని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ ప్రకటించింది.  రెగ్యులేటర్ విడుదల చేసిన ఇన్ఫోగ్రాఫిక్స్ ప్రకారం.. జనవరి 2023లో మొత్తం లావాదేవీలు – పాయింట్ ఆఫ్ సేల్, ఆన్‌లైన్ అమ్మకాలతో సహా – BD320.7 మిలియన్లు. ఇది గత ఏడాది ఇదే నెల కంటే 10.4 శాతం ఎక్కువ.  14,162,710 లావాదేవీలలో 76.8 శాతం కాంటాక్ట్‌లెస్‌గా ఉన్నాయి. డేటా ప్రకారం.. రెస్టారెంట్లు (4,930,931), సూపర్ మార్కెట్‌లు (3,024,452), ప్రభుత్వ సేవలు (967,567), ఆరోగ్య సేవలు (757,870), డిపార్ట్‌మెంట్ స్టోర్‌లు (580,775) జనవరి 2023లో అత్యధిక లావాదేవీలు జరిగిన వ్యాపారాలుగా నమోదయ్యాయి.

ప్రభుత్వ సేవలు విలువ పరంగా మొదటి ఐదు రంగాలలో మొదటి స్థానంలో ఉంది. రెస్టారెంట్లు (BD39.4 మిలియన్లు), సూపర్ మార్కెట్లు (BD30 మిలియన్లు), హోటళ్లు -రిసార్ట్‌లు (BD16.6 మిలియన్లు), ఆటో డీలర్లు (BD94.3 మిలియన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జనవరి 2022లో ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీలు భారీగా పెరిగినట్లు నివేదిక చెబుతుంది.  ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ (EFTS) ద్వారా ప్రారంభించబడిన Fawri, Fawri+, Fawateer సేవలను ఉపయోగించి గత నెలలో 26,972,898 లావాదేవీలు జరిగాయి. జనవరి 2023లో ఫౌరీ+ ద్వారా పూర్తి చేసిన లావాదేవీల సంఖ్య 24,696,138కి చేరుకోగా..  గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 48.9 శాతం పెరిగింది. అదే సమయంలో ఫౌరీ లావాదేవీలు గత నెలలో BD1.59 బిలియన్లు కాగా.. జనవరి 2022 నుండి 15.1 శాతం పెరిగాయి. అయితే ఫౌరీ+ డీల్‌లు మొత్తం BD564.8 మిలియన్లకు పెరిగాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సిస్టమ్ ద్వారా ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల విలువ BD8.73 బిలియన్లు జరిగాయి. గత సంవత్సరం ఇదే నెల కంటే ఇది 16.1 శాతం ఎక్కువ. ఇక ఏటీఎం ఉపసంహరణల పరిమాణంలో 7.9pc తగ్గి 1.09 మిలియన్లకు చేరుకుంది. వాటి విలువ 4.4pc నుండి BD107.19 మిలియన్లకు పడిపోయింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com