91 మిలియన్ దిర్హాంల విలువైన నకిలీ దుస్తులు సీజ్

- March 01, 2023 , by Maagulf
91 మిలియన్ దిర్హాంల విలువైన నకిలీ దుస్తులు సీజ్

యూఏఈ: రస్ అల్ ఖైమా అధికారులు ఒక గిడ్డంగి నుండి 91 మిలియన్ దిర్హాంల విలువైన 214,000 నకిలీ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 28 అంతర్జాతీయ బ్రాండ్‌ల లోగోలను కలిగి ఉన్న నకిలీ దుస్తులు ఉన్నాయని, రస్ అల్ ఖైమా (RAK-DED)లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ తెలిపింది. మోసానికి పాల్పడుతున్న కంపెనీ రస్ అల్ ఖైమా బయట స్థాపిత కంపెనీ అని, ఎమిరేట్‌లోని పాడుబడిన గిడ్డంగులలో వస్తువులను నిల్వ చేయడం ద్వారా తన వ్యాపారాన్ని నిర్వహిస్తుందని తమ నివేదికలో అధికారులు పేర్కొన్నారు. రస్ అల్ ఖైమా పోలీస్‌లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయంతో గోడాన్ లపై దాడులు చేసి, రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ దుస్తులు, వస్తువులు,  వాహనాలను జప్తు చేసినట్లు కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ తెలిపారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు. నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాల గురించి డైరెక్టర్ ఫైసల్ అల్యూన్ ప్రజలను హెచ్చరించారు. నకిలీ ఉత్పత్తుల వాడకంతో సదరు వ్యక్తుల ఆరోగ్యం, భద్రతకు హాని కలుగుతుందని వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com