యూఏఈ వీసా నిబంధనల్లో మార్పులు: ఇకపై బంధువుల స్పాన్సర్‌కు కనీస జీతం Dh10,000
- March 01, 2023
యూఏఈ: నివాస వీసా నియమాలలో యూఏఈ మార్పులు చేసింది. నివాస వీసాపై ఐదుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే యూఏఈ ప్రవాసులు తప్పనిసరిగా కనీస నెలవారీ జీతం Dh10,000 కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబరు 3, 2022న అమలు చేయబడిన కేబినెట్ తీర్మానం నెం. 65 షరతులు, నియంత్రణలకు సంబంధించి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ చైర్మన్ అలీ మొహమ్మద్ అల్ షమ్సీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు. అదే విధంగా ప్రవాస స్పాన్సర్‌లు బంధువుల నివాసానికి తగిన గృహాలను కలిగి ఉండాలి. ఆరుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకుంటున్న వారికి కనీసం Dh15,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి. డైరెక్టర్ జనరల్ 6 కంటే ఎక్కువ మంది బంధువుల స్పాన్సర్ కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







