అయ్యో పాపం.! సమంతా నీకిది తగునా.?
- March 01, 2023
నటిగా సమంతకున్న డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటన కోసం ప్రాణం పెట్టేసే అతి కొద్ది మంది నటీ నటుల్లో సమంత పేరు కూడా మొదటి వరుసలో వుంటుందనడం అతిశయోక్తి కాదేమో.
అయితే, ఈ మధ్య మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి సమంతలో కాస్త హుషారు తగ్గింది. అయినా సినిమా కోసం సెట్స్‌లో దూకితే సమంత పడే కష్టం కిక్కే వేరప్పా. ఈ మధ్యనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం సమంత కసరత్తులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా బాక్సింగ్ తదితర యాక్షన్ సన్నివేశాల్లో సమంత ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సమంత గాయాలపాలైంది. చేతులకు కొద్దిపాటి గాయాలయ్యాయని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమంత సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది.
సమంత డెడికేషన్ని మెచ్చుకుంటూ త్వరగా గాయాల నుంచి కోలుకోవాలని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







