మాస్ రాజా కోసం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఐదుగురు.!
- March 01, 2023
మాస్ రాజా రవితేజ ‘రావణాసుర’ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. అదేనండీ.. రవితేజ కొత్త సినిమా టైటిల్ రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. లేటెస్టుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశాడు మాస్ రాజా.
ఈ సినిమా కోసం మాస్ రాజా ఏకంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలతో జత కడుతున్నాడు. అందులో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, మేఘా ఆకాష్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా, తెలుగమ్మాయ్ పూజిత పొన్నాడ కూడా ఈ సినిమా కోసం రవితేజతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేస్తున్నారు. అలాగే, ‘జాంబిరెడ్డి’ ఫేమ్ దక్ష నగార్కర్ సైతం రవితేజ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమా కోసం. ఇలా ఐదుగురు ముద్దుగుమ్మలతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేస్తున్న మాస్ రాజా ‘రావణాసుర’తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు







