ట్రాఫిక్ ప్రమాదాల్లో 322 మంది మృతి
- March 02, 2023
కువైట్: 2022లో కువైట్ వ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తం 322 మంది మరణించారని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. 2021 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదం కారణంగా మరణించిన వారి సంఖ్య 323గా ఉందన్నారు. 2022 సంవత్సరంలో డైరెక్ట్ ఉల్లంఘనల సంఖ్య 1,384,842 కాగా, పరోక్ష ఉల్లంఘనలు 2,852,612 ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ కు సంబంధించిన ఉల్లంఘనల సంఖ్య 2,653,005, ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య 236,294గా ఉందని తెలిపారు. ఏడాది కాలంలో వివిధ కారణాలతో మొత్తం 5,076 కార్లు, 798 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ చెప్పారు. 2022 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య 68,770గా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







