జనవరిలో కురిసిన సగటు వర్షపాతం 40 ఏళ్లలో అత్యధికం
- March 02, 2023
రియాద్ : జనవరి నెలలో సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాలలో సగటు వర్షపాతం 23.58 మిల్లీమీటర్లు (మిమీ) రికార్డు స్థాయికి చేరుకుందని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది గత 40 ఏళ్లలో అత్యధికం అని తెలిపింది. మంత్రిత్వ శాఖ హైడ్రోలాజికల్ మానిటరింగ్ స్టేషన్ల రికార్డుల ప్రకారం.. ఇది 2022లో అదే నెలలో నమోదైన సగటు కంటే 15.41 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంది. మంత్రిత్వ శాఖ, నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) జనవరిలో 1980 రీడింగ్‌లను నమోదు చేసింది. అయితే మక్కా ప్రాంతంలోని జెడ్డా పోర్ట్ స్టేషన్లో జనవరి మొదటి రోజున అత్యధిక వర్షపాతం 84.6 మిమీగా నమోదైంది. జనవరిలో డ్యామ్‌లకు చేరిన వాగుల నుండి మొత్తం నీరు సుమారు 182.7 మిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా, వాటి నుండి విడుదల చేసిన మొత్తం నీటి పరిమాణం 108.9 మిలియన్ క్యూబిక్ మీటర్లు అని నివేదిక తెలిపింది. మక్కా ప్రాంతంలోని డ్యామ్‌ల పరిమాణం 70.9 మిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువగా ఉన్నందున ఇన్కమింగ్ టొరెషియల్ వాటర్‌లో అత్యధిక వాటా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మక్కా ప్రాంతంలోని రాబిగ్ డ్యామ్ దాదాపు 48.7 మిలియన్ క్యూబిక్ మీటర్లతో అత్యధిక ఇన్కమింగ్ టొరెంట్లను చూసిందని, అయితే టర్బా డ్యామ్ నుంచి అత్యధికంగా 15.2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







