మహిళా కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం

- March 02, 2023 , by Maagulf
మహిళా కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం

బహ్రెయిన్: హూరాలోని దార్ అల్ షిఫా మెడికల్ సెంటర్‌లో తక్కువ-ఆదాయ వర్గ మహిళా కార్మికుల కోసం ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్,  SGPT (లివర్ టెస్ట్), బ్లడ్ ప్రెజర్, బీఎంఐ(BMI), ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, డెంటల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మెగామార్ట్, ఆసుపత్రి అల్పాహారాన్ని అందించి మద్దతుగా నిలిచాయి. అనంతరం మహిళా కార్మికులకు వివిధ రాయితీలు ఇచ్చే లాయల్టీ కార్డ్‌లు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరానికి ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, శ్రీలంక, నేపాల్, బహ్రెయిన్, ఇండియా, బంగ్లాదేశ్, ఇథియోపియా వంటి వివిధ దేశాల నుండి రిసెప్షనిస్ట్‌లు, క్యాషియర్లు, క్లీనర్లు, క్లీనింగ్ సిబ్బంది సహా 120 మంది మహిళా గృహ సహాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంపై గత రెండు రోజులుగా రేడియో మిర్చి 104.2 FM కి విస్తృతంగా ప్రచారం నిర్వహించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com