తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్న ఫాక్స్ కాన్
- March 02, 2023
హైదరాబాద్: ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ దిగ్గజం హాన్ హాయ్ ఫాక్స్ కాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు.ఫాక్స్ కాన్ పెట్టుబడుల ద్వారా తెలంగాణలోని లక్ష మంది యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూ నేడు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో సమావేశమై పెట్టుబడులపై ప్రకటన చేశారని కెటిఆర్ వెల్లడించారు.ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.
కెటిఆర్ ఇటీవల ఢిల్లీలో ఫాక్స్ కాన్ చైర్మన్ తో భేటీ అయ్యారు.తెలంగాణకు రావాలంటూ ఆహ్వానించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను, రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కెటిఆర్ ఆయనకు వివరించారు. కెటిఆర్ ఆహ్వానంపై యంగ్ ల్యూ ఇవాళ తన బృందంతో హైదరాబాద్ విచ్చేశారు.ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందంతో సమావేశంలో సీఎం కెసిఆర్ తో పాటు కెటిఆర్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







