బేగంపేట ఎయిర్ పోర్టులో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ ..

- March 03, 2023 , by Maagulf
బేగంపేట ఎయిర్ పోర్టులో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ ..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో భారీ బహుమతిని ఇచ్చింది.రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (CARO) రూపుదిద్దుకుంటోంది. దీని కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతదేశంలో తొలి ‘గృహ-5’ ప్రమాణాలతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిశోధనా కేంద్రం రూపుదిద్దుకుంటోంది. ఇది పూర్తి అయితే 2023 జులై నుంచి ఇక్కడ పరిశోధనలు ప్రారంభంకానున్నాయి. దేశంలోని తొలి విమానయాన పరిశోధన కేంద్రం ఇది. భారతదేశంలో తొలి ‘గృహ-5’ ప్రమాణాలతో ఈ కేంద్రం ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణమవుతోంది. 2023 జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

బేగంపేటలోని 27 ఎకరాల్లో 2018లో ఈ కారో (CARO) కు శంకుస్థాపన జరిగింది. అప్పటి కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైపౌర విమానయాన పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ ఎమ్యులేషన్ , నెట్‌వర్క్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయి. అంతేకాకుండా ప్రమాద విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, డేటా మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సెంటర్‌లు కూడా ఈ కేంద్రంలో ఉంటాయి.

దీనిని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రూ. 402.13 కోట్ల వ్యయం అంచనాతో సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ ఎమ్యులేషన్ , నెట్‌వర్క్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్స్ ఏర్పాటకానున్నాయి. అంతేకా్గ..ప్రమాదాల విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యురిటీ ల్యాబ్, డేటా మేనేజ్మెంట్ , ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సెంటర్ లను ఈ కేంద్రం కలిగి ఉంటుంది.

పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన పలు భవనాల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. రూ.402 కోట్ల అంచనాతో ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్మిస్తోంది. ఇక్కడ పరిశోధన సదుపాయాలతోపాటూ ఎయిర్‌పోర్ట్స్‌ ఎయిర్‌ నావిగేషన్‌ సేవలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ కమ్యూనికేషన్స్‌ డొమైన్‌ సిమ్యూలేటర్స్‌, నెట్‌వర్క్‌ ఎమ్యులేటర్‌, విజువలైజేషన్‌, అనాలసిస్‌ ల్యాబ్‌లు, సర్వెలెన్స్‌ ల్యాబ్స్‌, నావిగేషన్‌, సిమ్యులేషన్స్‌ ల్యాబ్‌లు రానున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ, త్రెట్‌ అనాలసిస్‌ ల్యాబ్స్‌, డాటా మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ సపోర్ట్‌, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌, నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెంటర్లు రానున్నాయి. ఇక్కడే ఏవియేషన్‌ విశ్వవిద్యాలయం కూడా త్వరలో ఏర్పాటుకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com