తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- May 02, 2024
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతోపాటు.. ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీగా పెరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం వివరాల ప్రకారం.. బుధవారం శ్రీవారిని 72,510 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.62 కోట్లు. తిరుమలలో భక్తులు రద్దీ పెరగడంతో.. 12 కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..