పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం

- May 02, 2024 , by Maagulf
పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూ ఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలు 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న వేడిగాలుల పరిస్థితులకు సంబంధించిన ఆందోళనలపై స్పందించిన ఎన్నికల సంఘం (EC) రాష్ట్రంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ గంటలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించింది.

EC ప్రకటన ప్రకారం, మొత్తం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని సెగ్మెంట్లలో పోలింగ్ గంటలను పొడిగించాల్సిన అవసరాన్ని తెలిపారు. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థుల నుండి వచ్చిన ప్రతిపాదన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలలో పోలింగ్‌ సమయం పెంచారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం, తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ఇప్పుడు ఉదయం 7:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:00 గంటలకు ముగుస్తుంది. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలకు మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com