పసందైన మిక్స్డ్ ఫ్రూట్ రైతా
- June 19, 2015
పసందైన మిక్స్డ్ ఫ్రూట్ రైతా
కావలిసినవి
పెరుగు - 2 కప్పులు
అరటి పండు ముక్కలు - 2 కప్పులు
యాపిల్ ముక్కలు - 2 కప్పులు
దానిమ్మ గింజలు - 2 కప్పులు
పైనాపిల్ ముక్కలు 2 కప్పులు
మామిడిపండు ముక్కలు 2 కప్పులు
కొత్తిమీర తురుము - కొద్దిగా
పంచదార - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర టీ స్పూను
యాలకుల పొడి - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
పెరుగులో ఉప్పు, పంచదార, మిరియాల పొడి, యాలకుల పొడి కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసి బాగా గిలక్కొట్టాలి. తరువాత పైన చెప్పిన పండ్ల ముక్కలన్నీ కలిపి, చివరగా కొత్తిమీర తురుము కూడా వేసి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి.
వేసవిలో పెరుగు తినడం చాలా అవసరం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది పెరుగును అలాగే తినమంటే అంతగా ఇష్ట పడరు. అందుకే పెరుగును ఈ రకంగా అందిస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేస్తూ తినడానికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







