విటమిన్ ‘సి’ తో యోగాను మించిన ఆరోగ్యం
- June 19, 2015
వ్యాయామం చేయడంతో పోలిస్తే విటమిన్ ‘సి’ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు పదార్ధాలు సులభంగా కరిగే అవకాశం 30 శాతం ఎక్కువని అమెరికన్ న్యూట్రిషన్‌కి చెందిన నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ‘సి’ విటమిన్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అంటే నిమ్మజాతికి చెందిన అన్ని రకాల పండ్లలోనూ ఇది పుష్కలంగా లభిస్తుంది. ఈ ‘సి’ విటమిన్ ఎక్కువగా లభించే పండ్ల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కేవలం కొలెస్ట్రాల్ శాతం తగ్గడమే కాకుండా, గుండెజబ్బులు, రక్త పోటు వంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు ఈ పోషకం వల్ల రక్త కణాల పని తీరు కూడా మెరుగుపడి, శరీరానికి రక్త సరఫరా సరిగా జరగడం వల్ల అనేక రకాల ఆనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది. ఇంకా ఎండా కాలంలో ఎండలో ఎక్కువగా తిరిగే వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య. చర్మం కమిలిపోయి, నల్లగా మారిపోయి, మచ్చలు కూడా పడుతుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే శరీరానికి విటమిన్ ‘సి’ ఖచ్చితంగా అందేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







