అబుధాబీలో మరో రెండు మెర్స్ కేసుల నమోదు

- June 20, 2015 , by Maagulf
అబుధాబీలో మరో రెండు  మెర్స్ కేసుల నమోదు

అబుధాబీలోని ఆరోగ్యశాఖవారి అధీకృత సంస్థ ఐన ద హెల్త్ అథారిటీ ఆఫ్ అబుధాబీ (HAAD) వారి సమాచారం ప్రకారం, మెర్స్ కరొనా వైరస్ సోకి, 65 సంవత్సరాల పరదేశీయ మహిళా మృతిచెందినట్లు తెలిసింది. ఇంకొక కేసు కూడా నమోదైందని, ఐతే ఆ పేషెంటు ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిస్‌చార్జ్ కావచ్చని తెలిసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి సూచనల ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో నివారణాచర్యలు చేపట్టామని, ప్రతిఒక్కరి ఆరోగ్యం, భద్రతను గురించి, ఈ వైరస్ కేసులను  స్వీకరించడానికి ఎపిడెమిక్ ఇన్వెస్టిగేషన్ సెంటర్లు 24 గంటలు పని చేస్తున్నాయని తెలిపారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com