దుబాయ్, అబుధాబిలో దట్టమైన పొగమంచు. రెడ్, ఎల్లో అలర్ట్ జారీ
- March 04, 2023
యూఏఈ: దుబాయ్, అబుధాబిలో దట్టమైన పొగమంచు కారణంగా యూఏఈ వాతావరణ విభాగం రెడ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. శనివారం ఉదయం భారీ పొగమంచు ఏర్పడుతుందని నివాసితులను హెచ్చరించింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) ప్రకారం.. దృశ్యమానత 1,000మీ కంటే తక్కువగా పడిపోతుంది. ఇది కొన్ని తీరప్రాంత, అంతర్గత ప్రాంతాలలో అధిక ప్రభావం ఉండనుంది. వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్ వైపు ఎమిరేట్స్ రోడ్డు మీద పొగమంచు కమ్మే అవకాశం ఉందని MET విభాగం అంచనా వేసింది. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, కొన్ని ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ సమాచార బోర్డులపై ప్రదర్శించబడే వేగ పరిమితులను పాటించాలని సూచించింది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం షార్జాలో వర్షం, వడగళ్ల వాన కురిసింది. మలేహా, హమ్దా ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షాలు, వడగళ్ళు కురిశాయి. అలాగే ఖోర్ ఫక్కన్, అల్ దైద్ రోడ్, విషా, కొన్ని ఇతర తూర్పు ప్రాంతాలలో కూడా వర్షాలు కురిశాయి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







