పోస్టర్లతోనే పిచ్చెక్కిస్తోన్న సుధీర్ బాబు.!
- March 04, 2023
విలక్షణ కథలతో హీరోగా తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధీర్ బాబు. అయితే, ఈ మధ్య సుధీర్ బాబుకు సరైన హిట్టు పడడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ, కంటెంట్ విషయంలో తటపటాయిస్తున్నాడు.
అలాంటి సుధీర్ బాబు తాజాగా ‘మామా మశ్చీంద్ర’ అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. నటుడు, రచయిత అయిన హర్షవర్ధన్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా, ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ‘దుర్గ’ అనే పాత్ర ఒకటి కాగా, ఇంకోటి పరశురామ్ పాత్ర. ఆల్రెడీ ‘దుర్గ’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ రోల్ కోసం సుధీర్ బాబు చాలా లావుగా కనిపించబోతున్నాడు.
తాజాగా పరశురామ్ లుక్ రిలీజ్ చేశారు.ఈ పాత్రలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తున్నాడు సుధీర్ బాబు. ఇక ముచ్చటగా మూడో పాత్ర చాలా స్టైలిష్‌గా వుండబోతోందనీ తెలుస్తోంది. ఆ పాత్ర పేరు ‘డీజె’. పేరుకు తగ్గట్టుగానే డీజే పాత్ర యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టైలిష్ లుక్స్‌లో వుండబోతోందట. మార్చి 7న ఈ లుక్ రిలీజ్ చేయనున్నారట.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







