మార్చి 7న 'సుల్తాన్ ఆఫ్ స్పేస్'తో షేక్ మహ్మద్ ఇంటరాక్ట్
- March 05, 2023
యూఏఈ: భూమికి 400 కిమీ ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడితో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 7న ఇంటరాక్ట్ కానున్నారు. ఈ ఇంటరాక్షన్ మార్చి 7న సాయంత్రం 4.50 గంటలకు (యూఏఈ సమయం) జరగనుందని నాసా తెలియజేసింది. చివరిసారిగా షేక్ మొహమ్మద్ 2019లో ISSలో తన రెండవ రోజు వ్యోమగామి హజ్జా అల్మన్సూరితో సంభాషించారు. ఎనిమిది రోజులు గడిపిన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి UAE వ్యోమగామి అల్మన్సూరి రికార్డు సృష్టించారు.
సుల్తాన్ అల్నెయాడి ISSలో ఉండనున్న ఆరు నెలల్లో రెండు దుబాయ్ సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. అలాగే యూఏఈలోని విద్యార్థులందరికీ వ్యోమగామిని ప్రశ్నలను అడిగే అవకాశం కల్పంచనున్నారు. 20,000 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (MBRSC) తెలియజేసింది. MBRSC ఎమిరేట్స్ లిటరేచర్ ఫౌండేషన్‌తో కలిసి ఎల్ఫ్ ఇన్ స్పేస్ అనే విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరు నెలల పాటు 13 లైవ్ కాల్లు, 10 హామ్ రేడియో ఇంటరాక్షన్లు ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







