గల్ఫ్ నుండి ఇండియాకు ప్రతి ఏటా 4 లక్షల కోట్లు
- March 05, 2023
దుబాయ్: బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వచ్చి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసముంటున్న తెలుగు రాష్ట్రాల కార్మికులను బర్ దుబాయ్ వద్ద గల శ్రీ హోటల్ ప్రాంగణంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు..జైత నారాయణ, మోతె రామన్న ఆధ్వర్యంలో వీసా కాలపరిమితి ముగిసి గల్ఫ్ లో ఇరుక్కున్న బాధితులను కలిసి పరామర్శించారు., స్థానిక బీసీ నాయకులతో సమన్వయం చేసి జితేందర్ అనే బాధితుడికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించారు.. త్వరితగతిన బాధితుడిని ఇండియా కు పంపడానికి కావాల్సిన ఏర్పాట్లను చేయాల్సిందిగా దుబాయ్ కౌన్సులేట్ అధికారులను ,స్థానిక నాయకులను కోరారు.
దుబాయ్ లోని ప్రవాస గల్ఫ్ సోదరులు ఎదుర్కుంటున్న సమస్యలు, ఏజెంట్ల మోసాలు ,స్థానిక ప్రభుత్వ పాస్ పోర్ట్ ల జప్తు,భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందాల్సిన సహకారం, బీసీ కులవృత్తి దారులకు దుబాయ్ లో ఉన్న అవకాశాలు, బీసీల ఆర్ధిక సామాజిక రాజకీయ ఎదుగుదలకు చేపట్టాల్సిన వ్యూహాలను, నిర్వహించాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలను స్థానిక గల్ఫ్ నాయకులు, ప్రవాస భారతీయులతో దాసు సురేశ్ దీర్ఘంగా చర్చించారు.
కోరెపు మల్లేష్ నేతృత్వంలో గల్ఫ్ కార్మికుల క్యాంపులను చేరుకొని దాసు సురేశ్ కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు., తెలుగు రాష్ట్రాల్లో బీసీ రాజ్యాధికార సమితి గల్ఫ్ కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.. తదనంతరం ఏర్పాటు చేసిన గల్ఫ్ కార్మికుల సమావేశంలో ఎన్నారై పాలసీ అమలు జరగాలంటూ, బీసీ ల ఐక్యత వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు..స్థానిక నాయకులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గల్ఫ్ కార్మికుల సంరక్షణార్థం ఎన్నారై పాలసీ ని అమలుచేయాలని అందుకోసం ఎంత పెద్ద ఉద్యమాల నిర్మాణానికైనా తాము సిద్ధమని తెలిపారు.
సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ మాట్లాడుతూ ప్రవాస భారతీయులు నిజమైన దేశ భక్తులని కొనియాడారు.. సరిహద్దులో నిద్రాహారాలు లేకుండా కాపు కాస్తున్న మన సైనికులకు సరితూగే విధంగా 10 లక్షల కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఇండియా కు ప్రవాస భారతీయులు పంపుతున్నారన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఆర్ధిక సంక్షోభం వచ్చినా భారత దేశం స్థిరంగా ఆర్ధికంగా పరిపుష్ఠిగా ఉండటానికి ప్రవాస భారతీయులే కారణమన్నారు.. 3.2 కోట్ల మంది భారతీయులు 152 దేశాల్లో విస్తరించి ఉండగా గల్ఫ్ దేశాల లోనే కోటి మంది భారతీయ కార్మికులు వ్యయ ప్రయాసలకు ఓర్చుకుంటూ తమ కుటుంభం., దేశపు భాద్యతలను మోస్తున్నారన్నారు.
గల్ఫ్ లో భారతీయులు చనిపోతే కుటుంభ సభ్యుల కడసారి చూపుకు వారిని సొంత ఇంటికి చేర్చడానికి, మరియు ఇతర అవసరాలకు ఉపయోగపడే ఎన్నారై పాలసీ నిర్మాణం చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేయడం కడు విచారకరమన్నారు.. ప్రతి ఏటా గల్ఫ్ నుండి 4 లక్షల కోట్లు ఇండియాకు పంపుతుండటం వల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లు గణనీయంగా పెరిగాయన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలన్నారు.. గల్ఫ్ బాధితులకు అత్యవసరమైన ఎన్నారై పాలసీ సాధనకై గల్ఫ్ వాసులకు తాము అండగా ఉంటామని దాసు సురేశ్ గల్ఫ్ కార్మికులకు తెలిపారు.. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో గల్ఫ్ వాసులకు ప్రత్యేకమైన హెల్ప్ లైన్ సర్వీస్ ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
అపరిమిత అవకాశాలున్న గ్లోబల్ మార్కెట్ లోకి బీసీలు ఎగబాకాలన్నారు.బీసీలు తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లో వ్యాపార మార్గాలను అన్వేషించాలన్నారు.విదేశీ మార్కెట్లను అన్వేషించడం,భారత దేశ చేతి వృత్తి దారుల ఉత్పత్తులను విదేశీ మార్కెట్లో అనుసంధానం చేయడం, భారతీయుల ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం , ఆత్మహత్యలను నివారించడం బీసీ ఎన్నారైలను వ్యాపారస్థులుగా , పారిశ్రామిక వేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగడానికి అవలంభించాల్సిన వ్యూహాలపై, పరస్పర సహకార విధానాలపై స్థానిక వ్యాపారస్తులు, నాయకులతో చర్చలు జరిపారు.
బీసీలు ఎక్స్ పోర్ట్ ,వ్యాపార రంగంలో, పారిశ్రామిక రంగంలో , రాజకీయాల్లో ముందుకు రావాలన్నారు., ప్రపంచాన్ని చుట్టేసిన ప్రవాస భారతీయుల ఆర్ధిక , రాజకీయ నాయకత్వం నేడు దేశానికి ఎంతో అవసరమని తెలిపారు.అందుకు బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణ సహకారాన్ని అందజేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోతె రామన్న కొరెపు మల్లేష్ , నారాయణ జైత శ్రీధర్ గౌడ్ ,ఉట్నూరి రవి, రవీంధర్ PRO రాజు ,గుండెల్లి నర్సిములు, నల్ల నర్సయ్య ,తిరుపతి గౌడ్ ,శేరి అంజయ్య యుగంధర్, ఆరువల్ల మల్లేష్ , దొమ్మాటి సునీల్, ధశరత్, శేఖర్ , శ్రీధర్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!