యూఏఈలో భారతీయ ప్రవాసుల హోలీ సంబురాలు
- March 06, 2023
యూఏఈ: భారతీయ ప్రవాసుల హోలీ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. హోలీ పాటలతో రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు తినిపించుకుంటూ సందడి చేశారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆదివారం అబుధాబిలోని ఖలీఫా పాక్లో జరిగిన హోలీ వేడుకలో వేలాది మంది ప్రవాసులతో కలిసి పాల్గొన్నారు. ఇండియన్ బిజినెస్ ప్రొఫెషనల్ గ్రూప్ ఇరవై ఇతర కమ్యూనిటీ సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించబడిన ఈ వేడుకల సందర్భంగా రాజధానిలోని భారతీయ ప్రవాసులు రంగుల చల్లుకుంటూ ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. "హోలీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల మధ్య ఆనందం, ఐక్యతను సూచించే పండుగ. మూడు సంవత్సరాల కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయ సమాజం హోలీని జరుపుకోవడం ఇదే మొదటిసారి. ”అని అన్నారు.

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ పండుగను 'వసంతోత్సవం'గా జరుపుకుంటారు. పండుగకు ఒక రోజు ముందు కామదహనం చేయడం ఆచారం. ఇది 'చెడుపై మంచి' విజయాన్ని సూచిస్తుంది. ఇది శీతాకాలానికి వీడ్కోలుగా కూడా పరిగణిస్తారు. హిందూ మాసం 'ఫాల్గుణ్'లో 'పూర్ణిమ' పౌర్ణమి రోజు సాయంత్రం ఈ పండుగ ప్రారంభమవుతుంది. హోలీ మొదటి రోజును 'ఛోటీ హోలీ' అని కూడా పిలుస్తారు. మరుసటి రోజు రంగులతో హోలీ జరుపుకుంటారు. ఈ పండుగ ఉల్లాసాన్ని, ఆనందాన్ని మరియు భారతీయ సోదరుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని పెంచుతుంది.
దుబాయ్లో హోలీ వేడుకలు
దుబాయ్లో రంగుల పండుగను పురస్కరించుకుని దుబాయ్ స్పోర్ట్స్ సిటీలోని స్క్వేర్లో నిర్వహించిన హోలీ వేడుకలకు వేలాది మంది భారతీయులు తరలివచ్చారు. వేడుకల్లో 10 గంటల పాటు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లు హోరెత్తించాయి. డీజే కన్సోల్ తోపాటు పది మందికి పైగా కళాకారులు హోలీ వేడుకల ట్రాక్ లను ప్లే చేసారు. దానితో పాటు అనేక రంగులు, ఆహారం, పానీయాలను అక్కడ ఏర్పాటు చేశారు. గత పద్నాలుగు సంవత్సరాలుగా యూఏఈలో హోలీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు శిఖా అగర్వాల్ తెలిపారు. "దుబాయ్లో ఐదు వేల మందికి పైగా ప్రజలు హోలీ వేడుకలను జరుపుకుంటారు" అని శిఖా అగర్వాల్ చెప్పారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







