గల్ఫ్ కార్మికులతో ఎంపీ అరవింద్ ధర్మపురి ఆత్మీయ సమ్మేళనం...
- March 06, 2023
దుబాయ్: ఇండియన్ పీపుల్స్ ఫోరం (దుబాయ్) తెలంగాణ కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయ్ లోని ఆల్కుజ్ ప్రాంతంలోని అంబాసిడర్ స్కూల్ లో ఆదివారం సాయంత్రం ఎర్పాటు చేసిన తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి BJP విదేశీ వ్యవహారాల శాఖ ఇంచార్జి డాక్టర్ విజయ్ చౌతైవాలే, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అర్వింద్ ధర్మపురి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో ఇండియన్ పీపుల్స్ ఫోరంలో (IPF) చేరడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతి నిర్మాణానికి తోడ్పడాలని అరవింద్ ప్రవాసీయులకు విజ్ఞప్తి చేసారు.
ప్రజలతో పాటుగా విదేశాలలో ఉంటున్న తెలంగాణ బిడ్డలను కూడా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తన తప్పుడు వాగ్దానాలతో దగా చేసారని విమర్శించారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల సమస్యలన్ని కూడా పరిష్కారం చేస్తామని ఆయన హామనిచ్చారు.
బుర్జ్ ఖలీఫాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇళ్లు కొనుక్కొంటూ తెలంగాణ నాయకులు కొందరు ధనవంతులయితే పేద ప్రజలు మాత్రం గూడు కోసం విదేశాలకు వస్తున్నారని నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.
ప్రవాసీ భీమా యోజన పథకం కింద గల్ఫ్ ప్రవాసీయుల దాదాపు సమస్యలకు పరిష్కారం ఉందని కానీ దీన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి అమలు చేయడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ విమర్శించారు. కేవలం 325 రూపాయాలతో బీమా కింద ప్రవాసీయులకు, స్వదేశంలోని వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు గల్ఫ్‌లో న్యాయ సహాయం వరకు అన్ని రకాల ముఖ్య సేవలను కేంద్రం అందిస్తుందని ఆయన వివరించారు. మోదీ ప్రధానిగా కాకుండా ఒక పేదవాడిగా అలోచించడంతో ఈ రకమైన సేవలను ప్రవాసీ బీమా యోజన కింద తీసుకువచ్చారని బీజేపీ నాయకుడు అన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు అసలు సమస్యలే కావని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉండాలని అరవింద్ పెర్కోన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తన కాల్ సెంటర్ ద్వారా వేలాది మందికి తాను ఒక్కడ్ని సహాయం చేయగల్గినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయరాదని ఆయన ప్రశ్నించారు.గల్ఫ్ దేశాల నుండి తాను ఇప్పటి వరకు 4,700 తెలంగాణ ప్రవాసీయులను స్వదేశానికి రప్పించానని, అదే విధంగా తన ఫౌండేషన్ ద్వారా 1700 మంది రోగులకు వైద్య సహాయం అందించానని అరవింద్ అన్నారు.
దుబాయ్ లో రాజకీయ పార్టీల పేరు ప్రస్తావించ రాదని కానీ తాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకందరికి అర్ధమయి ఉంటుందని చెబుతూ ఆయన పరోక్షంగా విమర్శలు చేసారు. 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యాపారం చేసే తెలివి లేక ఖరీదయిన గడియారం కొనుక్కోలేదని కానీ “అమె” భర్త మాత్రం 20 లక్షల గడియారం కొనుకునేంత వ్యాపారం చేస్తున్నాడని ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేసారు.అమె జైలుకు వెళ్ళాలా వద్దా అని ఆయన సభా ముఖంగా ప్రశ్నించగా వెళ్ళాలంటూ కొందరు యువకులు నినాదాలిచ్చారు.
బీజేపీ కేంద్ర కార్యాలయంలో విదేశీ వ్యవహారాల విభాగం నెలకొల్పడం జరిగిందని అందులో నలుగురు సభ్యులుండగా దక్షిణాది రాష్ట్రాల నుండి తనను ఎంపిక చేసారని అరవింద్ తెలిపారు.
ఇండియన్ పీపుల్స్ ఫోరం (IPF) తెలంగాణ విభాగం నిర్వహించిన ఈ సమావేశానికి ఆశించిన దాని కంటే ఎక్కువ స్పందన లభించినట్లుగా నిర్వహకులు తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ ప్రవాసీయుల నుండి అనూహ్యమైన స్పందన లభించిందని వారు పెర్కోన్నారు.
సభ జరుగుతుండగా, నమాజు వేళ కావడంతో అజాన్ మొదలు కాగా ప్రధాని మోదీ తరహా తాను కూడా నమాజును గౌరవిస్తూ ప్రసంగాన్ని ఆపుతున్నట్లుగా ప్రకటించి ఆజాన్ జరిగినంత వరకు మౌనంగా ఉన్నారు.కార్యక్రమానికి బీజేపీ విదేశీ వ్యవహారాల శాఖ విభాగం అధిపతి విజయ చౌత్వాలే ముఖ్య అతిథిగా హాజరు కాగా ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ అధ్యక్షుడు జితేంద్ర వైద్య అధ్యక్షత వహించగా ఫోరం ప్రధాన కార్యదర్శి రంజీత్ కోడోత్ అతిథిగా పాల్గొనగా
ఫోరం తెలంగాణ విభాగం అధ్యక్షుడు కుంభాల మహేందర్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేసారు.
ఈ సమావేశంలో కటుకం రవి, వంశీ గౌడ్, నవనీత్ పటేల్, శరత్ గౌడ్, మదన్, జగదీశ్, గోవర్ధన్, వినోద్ ఆర్మూరీ, కోరేపు మల్లేష్, పెంకుల ఆశోక్, దీపికా శ్రీనివాస్ ,రమేష్ గదార్ల ,మేగీ కృష్ణహరి ,రేండ్ల శ్రీనివాస్ తో పాటు సుమారు 1,300 మంది గల్ఫ్ కార్మికులు పాలుగ్గొన్నారు.
మిషన్ తెలంగాణలో భాగంగా ఎడారి దేశాలలో ఉంటున్న ప్రవాసీయులను లక్ష్యంగా చేసుకోని వారి కుటుంబాలకు చెరువ కావడానికి బిజెపి వ్యూహాత్మకంగా ముందుకెళ్తుండగా అందులో ప్రవాసీయులు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అరవింద్ క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు.దుబాయ్ గవర్నమెంట్ నుంచి స్పార్క్ మీడియా వారు ఈ కార్యక్రమానికి సంభందించిన అనుమతులు తీసుకున్నారు.






తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









