రమదాన్: గ్రాండ్ మస్జీదులో 12వందల ఉద్యోగుల నియామకం
- March 06, 2023
మక్కా : రాబోయే రమదాన్ సీజన్‌లో ప్రత్యేక ప్రార్థనలకు గ్రాండ్ మస్జీదు సిద్ధమవుతోంది. ఈ మేరకు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే రమదాన్ సందర్భంగా దాదాపు 12,000 మంది అర్హత కలిగిన ఉద్యోగులను నియమించినట్లు పేర్కొంది. వీరితోపాటు ప్రెసిడెన్సీ గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదులో 10 కంటే ఎక్కువ స్వచ్ఛంద రంగాలలో పనిచేసేందుకు 8,000 కంటే ఎక్కువ వాలంటీర్లను నియమిస్తామని తెలిపింది. పవిత్ర రమదాన్ మాసంలో 200,000 కంటే ఎక్కువ వాలంటీర్ గంటలను సాధించాలని ప్రణాళిక రూపొందినట్లు.. తద్వారా రెండు పవిత్ర మస్జీదులలో స్వచ్ఛంద సేవను ప్రపంచంలోని అత్యంత వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవల్లో ఒకటిగా మారుతుందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వాహనాల సేవలను మెరుగుపరచడానికి 10,000 వాహనాలను సిద్ధం చేస్తున్నామని ప్రెసిడెన్సీ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







