మెటాలో భారీ లేఆఫ్స్...!!
- March 07, 2023
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ వారంలో వేలాది మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
గత ఏడాది నవంబర్‌లో మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 13శాతంతో 11వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్ధిక అనిశ్చితితో మరోసారి సిబ్బందిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది మెటా. మేనేజర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
రెండో దఫా తొలగింపులపై బ్లూమ్‌బర్గ్ ఫిబ్రవరిలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆ కథనానికి కొనసాగింపుగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసేందుకు మెటా సిద్ధమైంది. జుకర్ బర్గ్ నిర్ధేశించిన ఆర్ధిక లక్ష్యాలను చేరుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ మెటా ఇంటర్నల్ మీటింగ్‌లో పాల్గొని..పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉద్యోగి తెలిపారు.
కంపెనీల నుంచి మెటాకు వచ్చే యాడ్స్ తగ్గిపోవడంతో సంస్థ వర్చువల్ రియాలిటీ మెటావర్స్‌పై దృష్టిసారించింది. పొదుపు మంత్రం జపిస్తూనే ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే ఏ ఉద్యోగిని ఉంచాలి? ఎవర్ని తొలగించాలో చెప్పాలంటూ డైరెక్టర్లను, వైస్ ప్రెసిడెంట్‌లను అడుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







