మంచు లక్ష్మిని ఇబ్బంది పెట్టేసిన ఇండిగో
- March 07, 2023
ఈ మధ్య తరచూ పలు విమాన సంస్థలు వివాదంలో నిలుస్తున్నాయి. సరైన సదుపాయాలు అందివ్వకపోవడం తో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజల గగ్గోలు బయటకు రాకపోయినప్పటికీ , సినీ ప్రముఖులకు ఎదురైనా చేదు అనుభవాలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. తాజాగా సినీ నటి మంచు లక్ష్మి కి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసి ఇండిగో విమాన సంస్థ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోమవారం తిరుపతి నుంచి మంచు లక్ష్మి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆమె ఈ క్రమంలో తన బ్యాగ్ ను మరచిపోయారు. విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపారు. అయితే, దాదాపు 40 నిమిషాల పాటు గేటు బయట వెయిట్ చేశానని, సిబ్బంది ఎవరూ కూడా అసలు పట్టించుకోలేదని ఇండిగోను ట్యాగ్ చేస్తూ లక్ష్మి ట్వీట్ చేశారు. తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నానని, తన పర్స్ మరిచిపోయినట్టు సిబ్బందికి తెలిపినా స్పందించలేదన్నారు.
తాను తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి కూడా అంత సమయం పట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. గంటకు పైగా ఎదురు చూసినా తన పర్స్ తెచ్చివ్వలేదని ఆమె మరో ట్వీట్ చేశారు. గ్రౌండ్ స్టాఫ్ ఒక్కరు కూడా రాలేదని, అసలు ఒక్క కస్టమర్ సర్వీస్ కూడా లేకుండా ఇండిగో ఎలా నడుస్తోందంటూ ఆమె ప్రశ్నించారు. ‘బ్యాన్ ఇండిగో’ అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు. చివరకు స్పందించిన ఇండిగో అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. తమ మేనేజర్ తో మాట్లాడించినట్టు ట్వీట్ చేసింది. ‘మా మేనేజర్ మీకు సహకరిస్తారు.. మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం. తిరిగి మీరు మా ఫ్లైట్లో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం’ అని ఇండిగో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







