నేను బానే ఉన్నాను అంటూ అభిమానులకు చెప్పిన బిగ్ బి
- March 07, 2023
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్…తాజాగా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. బిగ్ బి ప్రమాదానికి గురయ్యారనే వార్త యావత్ చిత్రసీమ ను షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం బిగ్ బి ఆరోగ్యం ఎలా ఉందొ అని అంత ఆరా తీయడం చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బి తన ఆరోగ్యం ఫై క్లారిటీ ఇచ్చారు.
రెండు రోజుల క్రితం బిగ్ బి..ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ లో గాయపడ్డారు. ఒక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో ప్రమాదం జరిగి అమితాబ్ పక్కటెముకలకు గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ అమితాబ్ ను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం అమితాబ్ ముంబైకి పయనమయ్యారు. అమితాబ్‌కు రెండు నుంచి నాలుగు వారాలు బెడ్ రెస్ట్ అవసరమని తర్వాత షూటింగ్ లో పాల్గొనచ్చని వైద్యులు సూచించారు. అయితే, తాజాగా అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా తన హెల్త్ అప్ డేట్ పంచుకున్నాడు.
‘నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసినవాళ్లందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రార్థనలకు నేను పొంగిపోయాను. మీ వల్లే నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడిప్పుడే నా ఆరోగ్యం కుదుటపడుతోంది. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చు. డాక్టర్లు సూచించిన వాటిని జాగ్రత్తగా ఫాలో అవుతున్నా. కొన్నాళ్లు విశ్రాంతి అవసరం. నావల్ల చాలా పనులు ఆగిపోయాయి. అన్ని పరిస్థితులు మెరుగుపడి డాక్టర్ సూచించిన తర్వాత ముందుకు సాగుతా. అందరికీ హోలీ శుభాకాంక్షలు. త్వరలో కలుద్దాం’ అంటూ తన హెల్త్ అప్ డేట్ గురించి తెలిపాడు.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







