మృతుడి కుటుంబం వేసిన Dh200,000 పరిహారం దావా కొట్టివేత
- March 07, 2023
యూఏఈ: అబుధాబిలో కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబం వేసిన 200,000 దిర్హామ్ నష్టపరిహారం దావాను సివల్ కోర్టు కొట్టివేసింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, అతని కారు బీమా సంస్థ నష్టపరిహారం ఇప్పించాలని దావాలో పేర్కొన్నారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ముద్దాయి అయిన డ్రైవర్ ప్రమాదవశాత్తు.. బాధితుడు నడుపుతున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ కు అబుధాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్‌ల జరిమానా విధించింది. అలాగే మృతుడి కుటుంబానికి 200,000 దిర్హామ్ బ్లడ్ మనీ చెల్లించాలని కూడా ఆదేశించింది. అయితే, మృతుడి కుటుంబం భీమా సంస్థపై సివిల్ దావా వేసింది. తాము అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కోర్టు తీర్పులో ఇప్పటికే వాదులకు బ్లడ్ మనీ లభించిందని ప్రతివాదుల తరపు న్యాయవాది వాదించారు. న్యాయబద్ధత లేని కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. అన్ని పక్షాల వాదనలు విన్న సివిల్ కోర్టు కేసును కొట్టివేసింది. ఇప్పటికే ఆ కుటుంబానికి బ్లడ్ మనీ అందజేశారని, అదే కేసులో ఫిర్యాదుదారులు నష్టపరిహారం దావా వేయడానికి వీల్లేదని న్యాయమూర్తి అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







