మాస్ కా దాస్ ‘ధమ్కీ’.! ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్.!
- March 10, 2023మాస్ కా దాస్‌గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ తాజా సినిమా ‘ధమ్కీ’. వాయిదాల పర్వం ముగించుకుని ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ సినిమా మార్చిలో మూడు రిలీజ్ డేట్లు సెట్ చేసుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ 24కు వాయిదా పడింది. మళ్లీ మార్చి 31న రిలీజ్ అన్నారు.
కానీ, సడెన్‌గా మార్చి 22న పక్కా.. అంటూ తాజాగా ఫిక్స్ అయిన రిలీజ్ డేట్‌ని మేకర్లు ప్రకటించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి విశ్వక్ సేన్ సర్వం తానే అయ్యాడు.
ప్రొడక్షన్‌తో పాటూ, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌నీ తానే డీల్ చేసుకున్నాడు. ఇక, సినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో, ప్రమోషన్లు షురూ చేసే యోచనలో వున్నాడు మాస్ కా దాస్.
తన సినిమాల్ని వినూత్నంగా ప్రచారం చేసుకోవడంలో విశ్వక్ సేన్ ముందుంటాడు. మరి, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏం కొత్త ప్రయోగాలు చేయనున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు