రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం..
- March 10, 2023
అమరావతి: 222వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో గతేడాది రుణ ప్రణాళిక లక్ష్యాలు-సాధన పై ఎస్ ఎల్ బీసీ వివరాలు అందించింది.ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందన్నారు సీఎం. ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందన్నారు. కొన్ని రంగాలకు సంబంధించి పనితీరు చాలా బాగుందని అయితే మరికొన్ని కీలక రంగాలకు మరింత ప్రోత్సాహం అవసరం అన్నారు సీఎ జగన్. విద్యారంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయని… సామాజిక,ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమని ఈ రెండు రంగాల పట్ల మరింత సానుకూల దృక్పథంతో బ్యాంకులు ముందడుగు వేయాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో 83.36శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారని ఈ రంగంపై ఎస్ ఎల్ బీసీ దృష్టి సారించాలన్నారు.
కౌలు రైతులకు రుణాలకు సంబంధించి డిసెంబర్ 2022 వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించినట్లు సీఎం చెప్పారు..డ్వాక్రా గ్రూపులకు ఇచ్చే రుణాలపై వడ్డీల విషయంలో బ్యాంకులు మరోసారి ఆలోచన చేయాలని ఆయన కోరారు…నాబార్డు, బ్యాంకులు డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు..MSME లపై బ్యాంకింగ్ రంగం మరింత శ్రద్ధ వహించాలని సీఎం బ్యాంకర్లను కోరారు.
ద్వారా దాదాపు 13లక్షల కోట్లపెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం . ఈ పెట్టుబడులు పెట్టేందుకు రుణాల లభ్యత చాలా ముఖ్యమైనదని…అనుబంధ యూనిట్లకు అవసరమైన మద్దతును కూడా బ్యాంకింగ్ రంగం అందించాలని సీఎం కోరారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







