డేటా బ్రోకర్ ఉల్లంఘనలో ఇండియా 2వ స్థానం..

- March 10, 2023 , by Maagulf
డేటా బ్రోకర్ ఉల్లంఘనలో ఇండియా 2వ స్థానం..

డేటా బ్రోకర్ ఉల్లంఘనల విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని, గత 20 ఏళ్లలో 10 డేటా ఉల్లంఘనల ద్వారా 1.8 కోట్ల (18.7 మిలియన్) మంది భారతీయ పౌరుల వ్యక్తిగత రికార్డులు లీక్ అయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. డేటా బ్రోకర్ అనేది వివిధ రకాల మూలాధారాల నుంచి సమాచారాన్ని సమగ్రపరిచే వ్యాపారం. అది డేటాను మెరుగుపరచడం, రీఫ్రెష్ చేయడం లేదా విశ్లేషించడంతో పాటు ఇతర సంస్థలకు లైసెన్స్ ఇవ్వడం లాంటివి చేస్తుంది.

వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ సర్ఫ్‌షార్క్ ద్వారా ప్రముఖ డేటా రిమూవల్ సర్వీస్ అయిన ఒక అజ్ణాత సంస్థ ప్రకారం, డేటా బ్రోకర్ ఉల్లంఘనల ద్వారా ఎక్కువగా అత్యంత ప్రభావితమైన మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఒకటి. కాగా ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 207.6 మిలియన్ల వ్యక్తిగత డేటా లీకైందట. ఇక ఇండియా తరువాత బ్రిటన్, బ్రెజిల్, కెనడా దేశాలు ఉన్నాయి.

“డేటా గోప్యత మరింత ప్రమాదకరంగా మారుతోంది. అయినప్పటికీ చాలా మందికి డేటా బ్రోకర్లు పనిచేసే రహస్య మార్కెట్ గురించి తెలియదు. కనుగొన్న వాటిని సమీక్షించిన తర్వాత, ఇతర కంపెనీల మాదిరిగానే డేటా బ్రోకర్లు కూడా డేటా ఉల్లంఘనకు గురువుతున్నట్లు మేము గమనించాము. అయితే వారు భారీ మొత్తంలో సున్నితమైన డేటాతో చెలగాటం ఆడుతున్నారు” అని సదరు అజ్ఞాత సంస్థ చీఫ్ డారియస్ బెలెజెవాస్ తెలిపారు.

ఈ అజ్ణాత సంస్థ పరిశోధకులు 506 నమోదిత, అమెరికా ఆధారిత డేటా బ్రోకర్‌లను విశ్లేషించారు. గత 20 సంవత్సరాలలో, ఈ కంపెనీలలో 23 (4.5 శాతం) డేటా ఉల్లంఘనలకు గురయ్యాయని, ఇప్పటి వరకు కనీసం 10 డేటా బ్రోకర్ ఉల్లంఘనల ఫలితంగా కనీసం పది లక్షల మంది వినియోగదారులు ఉన్నారని కనుగొన్నారు. మొత్తం 207 మిలియన్ల (2 కోట్లు) రికార్డులను బహిర్గతం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com