భక్తులకు అల్పాహారం...
- May 05, 2016
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. ఇప్పటివరకూ అందిస్తున్న ఉచిత భోజన సదుపాయంతోపాటు అల్పాహారాన్ని కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని అందించే పథకానికి టీటీడీ ఈవో సాంబశివరావు శ్రీకారం చుట్టారు. భక్తులకు టిపిన్ను పెట్టి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతీరోజూ ఉదయం పూట రెండు గంటల పాటు ఈ అల్పాహారాన్ని వడ్డిస్తారు. ఒకేసారి నాలుగు వేల మంది భక్తులకు అల్పాహారం అందించగల సామర్ధ్యం ఉందని ఈవో తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదం ట్రస్టు కింద మొత్తం 700 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నందుకు భక్తులకు ఉపయోగపడే మరిన్ని సౌకర్యాలపై దృష్టిపెట్టినట్లు సాంబశివరావు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







