సౌదీ చమురు ఎగుమతులపై ధరల పరిమితి వద్దు: ప్రిన్స్ అబ్దుల్ అజీజ్

- March 15, 2023 , by Maagulf
సౌదీ చమురు ఎగుమతులపై ధరల పరిమితి వద్దు: ప్రిన్స్ అబ్దుల్ అజీజ్

రియాద్ : సౌదీ చమురు ఎగుమతులపై ధరల పరిమితిని విధించవద్దని సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. సౌదీ చమురు ఎగుమతులపై ధర పరిమితిని విధించినట్లయితే, తమ సరఫరాపై ధర పరిమితిని విధించే ఏ దేశానికీ మేము చమురును విక్రయించబోమని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్లు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ తెలిపారు. ముఖ్యంగా అన్ని ఇతర కమోడిటీ మార్కెట్‌లతో పోలిస్తే చమురు మార్కెట్‌కు గణనీయమైన స్థిరత్వం, పారదర్శకతను తీసుకురావడంలో OPEC+ అన్ని ప్రయత్నాలు చేసి విజయం సాధించిందని ఆయన పునరుద్ఘాటించారు. నోపెక్ చమురు సామర్థ్యంలో పెట్టుబడులను కూడా తగ్గిస్తుందని, ప్రపంచ సరఫరా భవిష్యత్తులో డిమాండ్‌కు చాలా తక్కువగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిదారులు,  వినియోగదారులపై అలాగే చమురు పరిశ్రమపై కూడా ఉంటుందని తెలిపారు. నోపెక్ చట్టం, ధరల పరిమితిని పొడిగించడం అనేది స్పష్టత, స్థిరత్వం అత్యంత అవసరమైన సమయంలో కొత్త ప్రమాదాలను, అనిశ్చితిని జోడిస్తుందని ఆయన అన్నారు.సౌదీ అరేబియా 2027 నాటికి సామర్థ్యాన్ని 13.3 మిలియన్ బి/డికి విస్తరించడం ప్రారంభించిందని, మొదటి ఉత్పత్తి 2025లో అందుబాటులోకి వస్తుందని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com