ప్రపంచ చలన చిత్రోత్సవానికి ఎంపికైన చిల్కూరి ‘స్వప్నిక’, ‘నోస్టాల్జియా’
- March 15, 2023
హైదరాబాద్: డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన “స్వప్నిక”, “నోస్టాల్జియా” అనే రెండు డాక్యుమెంటరీలు.. మార్చి 19న హైదరాబాద్‌లో జరిగే 7వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివా -23కి ఎంపికయ్యాయి. ఈ రెండు సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లోని లక్డికాపూల్‌లో జరిగే ఈ ఈవెంట్‌లో ఫీచర్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, షార్ట్ డాక్యుమెంటరీలు, వీడియోలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని మినీ బాక్స్ ఆఫీస్, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ NCR నిర్వహిస్తోంది.
చిల్కూరి సుశీల్ రావు తీసిన ‘స్వప్నిక’ అనే డాక్యుమెంటరీ స్వప్నిక అనే
అమ్మాయి కథ. ఆమె స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్. ఆమె చిన్నతనంలో విద్యుదాఘాతానికి గురై
రెండు చేతులను కోల్పోతుంది. స్వప్నిక తన దృఢ సంకల్పం, పట్టు వదలని స్ఫూర్తితో
డిగ్రీ చదువును పూర్తి చేస్తుంది. శారీరక వైకల్యం ఎదురైనా.. అనుకున్నది సాధించి
జీవితాన్ని జయించవచ్చని స్వప్నిక డాక్యుమెంటరీ ద్వారా డైరెక్టర్ చూపించారు.
"నోస్టాల్జియా" పేరుతో చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన మరో డాక్యుమెంటరీ సికింద్రాబాద్‌లోని 111 ఏళ్ల నాటి స్కూల్ సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్‌లో 'నోస్టాల్జియా' రోజు కోసం వృద్ధ విద్యార్థులు కలిసి ఎలా జరుపుకున్నారనే దాని చుట్టు ఉంటుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు బెనో జోసెఫ్ సంగీతాన్ని అందించగా, ఎలిజా ఇమ్మాన్యుయేల్ సమర్పకులు. నిషాన్ సంప్రీత్ చిల్కూరి పథ్య గాయకుడు. ఈ రెండు డాక్యుమెంటరీలను చిల్కూరి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించారు.
చిల్కూరి సుశీల్ రావు గత 35 ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. అతను హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని , జర్నలిజం విభాగం నుండి బంగారు పతకాన్ని సాధించారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) కోర్సులు చేశారు. సినిమా స్టడీస్‌పై మద్రాస్ ఐఐటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు చేశారు. అతను కేరళ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ అప్రిషియేషన్‌లో కోర్సు చేసారు. 55 ఏళ్ల చిల్కూరి సుశీల్ రావు ప్రస్తుతం హైదరాబాద్‌లోని టి-హబ్‌లో అందించే ‘సినీప్రెన్యూర్’ కోర్సును కూడా అభ్యసిస్తున్నారు. ఈ కోర్సు MEE స్కూల్ సహకారంతో అందిస్తున్నారు.
డిసెంబర్ 2022లో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిల్కూరి సుశీల్ రావు “ఇండియాస్ గ్రీన్‌హార్ట్ దుశర్ల సత్యనారాయణ” ఉత్తమ జ్యూరీ అవార్డును అందుకున్నారు. చిల్కూరి సుశీల్ రావు నిర్మించి దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీలు కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రెంచ్ రివేరా, ఫ్రాన్స్‌లో కూడా మంచి పేరును సంపాదించాయి.

తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







